మ‌రో వివాదాస్ప‌ద చిత్రంతో వ‌స్తున్న వ‌ర్మ‌!


సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కాంట్ర‌వ‌ర్సీ స‌బ్జెకుల‌ని బేస్ చేసుకొని వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు అనే వివాదాస్ప‌ద చిత్రం చేస్తున్న వ‌ర్మ తాజాగా మ‌రో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. హైద‌రాబాద్ దాదాల‌పై సినిమా చేయ‌బోతున్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించాడు. దాదాస్ ఆఫ్ హైద‌రాబాద్‌లో న‌టించేందుకు జార్జిరెడ్డి సందీప్ మాధ‌వ్ సైన్ చేశాడు. విజ‌య‌వాడ రౌడీలు, రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్టులపై సినిమాలు తీసిన నేను 80ల కాలం నాటి హైద‌రాబాద్ దాదాల‌పై సినిమా చేయ‌బోతున్నాను. నా శివ సినిమా లాగా ఈ చిత్రంని కూడా కొన్ని రియ‌ల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆధారంగా తెర‌కెక్కిస్తాను అని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. మ‌రి ఈ సినిమాతో వ‌ర్మ ఎన్నిసంచ‌ల‌నాలు సృష్టిస్తాడో చూడాలి.