సియాచిన్‌లో విరిగిప‌డ్డ మంచుచ‌రియ‌లు.. ఆరుగురు మృతి


హైద‌రాబాద్‌: సియాచిన్ మంచుచ‌రియ‌లు విరిగిప‌డ్డ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెందారు. మ‌ర‌ణించిన‌వారిలో న‌లుగురు సైనికులు, ఇద్ద‌రు సాధార‌ణ పౌరులు ఉన్నారు. సోమ‌వారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని సియాచిన్ గ్లేసియ‌ర్ వ‌ద్ద మంచు చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. 8 మంది స‌భ్యులు ఉన్న ఓ టీమ్‌పై మంచుచ‌రియ‌లు ప‌డిన‌ట్లు స‌మాచారం. హైపోథ‌ర్మియా వ‌ల్ల ఆ బృందంలోని స‌భ్యులు మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు చెప్పారు. సియాచిన్ గ్లేసియ‌ర్‌లోని నార్త‌ర్న్ సెక్ట‌ర్‌లో సుమారు 19వేల ఫీట్ల ఎత్తులో సైనికులు విధులు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆర్మీ చెప్పింది. అయితే స‌మీప పోస్టుల వ‌ద్ద ఉన్న రెస్క్యూ టీమ్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న‌ది.