గ్రీన్ ఛాలెంజ్ గొప్ప స్ఫూర్తిదాయకం :కంచర్ల 

గ్రీన్ ఛాలెంజ్ గొప్ప స్ఫూర్తిదాయకం :కంచర్ల 


 నల్లగొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన హరితహారం కార్యక్రమం స్పూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్
 కుమార్  చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు.  మీడియా అకాడెమీ చైర్మన్,  TUWJ(143) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపు మేరకు సోమవారం  నల్లగొండ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని జర్నలిస్టులు, ఉద్యోగుల వెల్ నెస్  సెంటర్ వద్ద గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో, వీడియో, చిన్న పత్రికల జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. యావత్ దేశం వ్యాప్తంగా, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అందరూ వివిధ రంగాల ప్రముఖులు రాజకీయ నాయకుల్లో చైతన్యం తీసుకొచ్చి  స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా విజయ పరంపరలో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్  కార్యక్రమంలో  భాగంగా మీడియా అకాడెమీ చైర్మన్, TUWJ(143) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ  పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున గ్రీన్ చాలెంజ్  కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే అనంతరం వెల్నెస్ సెంటర్ ను సందర్శించి ఉద్యోగులకు జర్నలిస్టులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  ఉమ్మడి జిల్లా కేంద్రంలోని ఆయా దిన పత్రికల్లో పనిచేస్తున్న ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేస్తున్న అన్ని విభాగాల బాధ్యులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, చిన్న, మధ్యతరహా దిన పత్రికలు మరియు మ్యాగజైన్స్ సంపాదకులు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో TUWJ(143) జిల్లా అధ్యక్షుడు క్రాంతి, ప్రధాన కార్యదర్శి గుoడగోని జయశంకర్ గౌడ్,  జిల్లా ఎలక్ట్రాన్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి మహేందర్ రెడ్డి,ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ, ప్రధాన కార్యదర్శి విజయ్, వీడియో  జర్నలిస్టు శ్రీనివాస్ గౌడ్ , జిల్లా చిన్నపత్రికల సంఘం అధ్యక్షుడు  యన్నమల్ల రమేష్ బాబు, జర్నలిస్టులు ముచ్చర్ల శ్రీనివాస్, కంది సూర్యనారాయణ, ద౦డ్డంపల్లి రవికుమార్చిం, చిoతా యాదగిరి, మల్లేష్ యాదవ్, కంది వేణుగోపాల్, రమేష్' రాజు, దోసపాటి ముత్తయ్య, వేముల వెంకటేశ్వర్లు, రేగట్ట వెంకట్ రెడ్డి,  పిట్టల రామకృష్ణ, తాడిశెటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.